ProZ.com translation contests »
32nd Translation Contest: "Movie night" » English to Telugu

Competition in this pair is now closed.

Discussion and feedback about the competition in this language pair may now be provided by visiting the "Discussion & feedback" page for this pair. Entries may also be individually discussed by clicking the "Discuss" link next to any listed entry.

Source text in English

To say that I was compelled by Parasite from start to finish is an understatement; its filming style with tracking shots are enthralling. Having watched several Korean films during the London Korean Film Festival, I was familiar with the usual genres employed in such films but Parasite seemed to defy them all! Parasite is comedic, in a quirky way, it is also a thriller, straddles class divisions and also depicts a family tale amongst other genres and is therefore likely to appeal to all ages.

Parasite truly deserves to be watched in a cinema to appreciate its nuances and the stylish cinematography. As a summary, to avoid spoilers, Parasite tells the tale of the interaction between the Park family and the Kim’s, an unemployed family, whose contrasting worlds collide with long lasting consequences.

[...]Bong Joon-Ho manages to pique the audience’s interest with brightly lit shots coupled with the effective use of indoor space, and it is surprising to realise, after the film’s 2 hour 12 minute length, that most of the scenes occur within the Park family’s home. The mundane elements of domesticity are displayed with an intriguing perspective showcasing Bong Joon-Ho’s flair. It is a slow burner but you will revel in its beauty and ingenuity as Parasite convinces that it operates solely on one level but it is in fact multi-layered and depicts social realism with empathy and pathos.

The cast are beguiling to watch, every facial movement and action is accentuated, even the mere act of walking up or down stairs can convey hidden meaning, which the camera fragments. Levels of unease are also created by virtue of that effective use of space with unusual camera angles and dramatic weather conditions ratcheting up that sensation. There is a surreal nature to Parasite, which its score emphasises, and furthermore the film adopts elements of the absurd devised in such an ingenious way which is truly cinematic magic. Parasite’s apparent eeriness will certainly keep you riveted and would not feel alien to the Twilight Zone school of filmmaking.

The actors are very impressive and add breadth to their roles creating relatability whilst seeming effortlessly cool. When Ki-Woo and Ki-Jeong Kim were working within the Park family home as private tutors they certainly epitomised this level of nonchalant, understated authority creating an aura of mysticism with the unspoken, almost mythical, tutoring techniques employed. Quite simply, the actors Park So-Dam and Choi Woo-Sik, as Ki-Woo and Ki-Jeong, are compelling to watch in the different directions that Parasite follows and they carry these performances seamlessly thereby inviting the audience to be on their side.

[...]Parasite is a remarkable piece of extremely skilful filmmaking, it is simply a must see film, and so I am looking forward to re-watching the film on its UK general release date.

Winning entries could not be determined in this language pair.

There were 3 entries submitted in this pair during the submission phase. Not enough votes were submitted by peers for a winning entry to be determined.

Competition in this pair is now closed.


Entries (3 total) Expand all entries

Filter entries
Language variants:
నేను పారాసైట్‌ సినిమా తప్పనిసరిగా మొదటి నుండి చివరి వరకు చూసేందుకు ఆ సినిమానే కారణం అని చెప్పడం ఒక చిన్నమాట; ట్రాకింగ్ షాట్‌లతో దాని చిత్రీకరణ శైలి మనోహరంగా ఉంది. లండన్ కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా అనేక కొరియన్ చిత్రాలను నేను చూసాను, అటువంటి చిత్రాలలో ఉపయోగించే సాధారణ జానర్‌లు నాకు బాగా తెలుసు, కానీ పారాసైట్‌ వాటన్నింటినీ ధిక్కరించినట్లు అనిపించింది! పారాసైట్‌ ఇతర శైలులలో చమత్కారమైన రీతిలో హాస్యాస్పదమైనది, ఇది ఉద్వేగపూరితమైనది కూడా, వర్గ విభజనలను అడ్డుకుంటుంది, మరియు కుటుంబ కథను కూడా వర్ణిస్తుంది, మరియు అందువల్ల అన్ని వయసుల వారిని ఆకర్షించే అవకాశం ఉంది.
ఇది నిజంగా చూడవలసిన సినిమా, మరియు దాని సూక్ష్మ నైపుణ్యాలను మరియు స్టైలిష్ సినిమాటోగ్రఫీని మెచ్చుకోవడానికి అర్హత కలిగి ఉంది. సారాంశంగా, దానిని పాడుచేయకుండా నివారించడానికి, పార్క్ కుటుంబం మరియు కిమ్స్ అనే నిరుద్యోగ కుటుంబం, విరుద్ధ ప్రపంచాలు దీర్ఘకాలిక పరిణామాలతో ఢీకొంటాయి, వారి మధ్య పరస్పర చర్య గురించి పారాసైట్ చెబుతుంది.
బాంగ్ జూన్-హో మంచి షాట్‌లతో పాటు ఇండోర్ స్పేస్‌ను సమర్థవంతంగా ఉపయోగించడంతో ప్రేక్షకుల ఆసక్తిని రేకెత్తించారు, ఆశ్చర్యం ఏమిటి అంటే, సినిమా 2 గంటల 12 నిమిషాల నిడివి తర్వాత, చాలా సన్నివేశాలు పార్క్ కుటుంబం యొక్క ఇంటిలోనే జరుగుతాయని గ్రహించడం. బాంగ్ జూన్-హో యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించే చమత్కార దృక్పథంతో దేశీయత యొక్క ప్రాపంచిక అంశాలు ప్రదర్శించబడతాయి. ఇది నిదానము, అయితే మీరు దాని అందం మరియు చాతుర్యంతో ఆనందిస్తారు, పారాసైట్‌ ఒక స్థాయిలో మాత్రమే పనిచేస్తుందని ఒప్పిస్తుంది, అయితే ఇది నిజానికి అనేక భిన్నత్త్వాలు మరియు సానుభూతి మరియు అనుభూతితో సామాజిక వాస్తవికతను వర్ణిస్తుంది.
తారాగణం చూడటానికి మోసపూరితంగా కనిపిస్తుంది, ప్రతి ముఖ కదలిక మరియు చర్య ప్రాధాన్యతనిస్తుంది, మెట్లు పైకి లేదా క్రిందికి నడవడం కూడా దాగి ఉన్న అర్థాన్ని తెలియజేస్తుంది, కెమెరా(చిత్రీకరణ) చెబుతుంది. అసాధారణమైన కెమెరా కోణాలు మరియు నాటకీయ వాతావరణ పరిస్థితులతో ఆ అనుభూతిని పెంచే ప్రదేశాన్ని సమర్థవంతంగా ఉపయోగించడం వల్ల కూడా అసౌకర్య స్థాయిలు సృష్టించబడతాయి. ప్రధాన అంశం నొక్కిచెప్పే విధంగా పారాసైట్‌కి అధివాస్తవిక స్వభావం ఉంది, మరియు ఇంకా ఈ చిత్రం అసంబద్ధమైన అంశాలను అటువంటి తెలివిగల విధంగా రూపొందించబడింది, ఇది నిజంగా సినిమాటిక్ మ్యాజిక్. దాని స్పష్టమైన వింతత్వం మిమ్మల్ని నిస్సందేహంగా ఉంచుతుంది మరియు ట్విలైట్ జోన్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్‌కు పరాయిగా అనిపించదు.
నటీనటులు చాలా ఆకట్టుకుంటారు మరియు అప్రయత్నంగా కూల్‌గా కనిపించేటప్పుడు సాపేక్షతను సృష్టించే వారి పాత్రలకు విస్తృతతను జోడించారు. కి-వూ మరియు కి-జియాంగ్ కిమ్ పార్క్ కుటుంబ గృహంలో ప్రైవేట్ ట్యూటర్‌లుగా పని చేస్తున్నప్పుడు, వారు ఖచ్చితంగా ఈ స్థాయి నిర్లక్ష్యతని సూచిస్తారు, అధికారం తక్కువగా, చెప్పని వాటితో మార్మికత యొక్క ప్రకాశాన్ని సృష్టిస్తుంది, దాదాపు కల్పితంగా, బోధించే పద్ధతులు ఉపయోగించబడ్డాయి. చాలా సరళంగా, నటీనటులు పార్క్ సో-డామ్ మరియు చోయ్ వూ-సిక్, కి-వూ మరియు కి-జియాంగ్ వంటివారు, పారాసైట్‌ అనుసరించే వివిధ దిశలలో చూడాలని బలవంతం చేస్తారు మరియు వారు ఈ ప్రదర్శనలను సజావుగా నిర్వహిస్తారు, తద్వారా ప్రేక్షకులను తమ వైపు ఉండమని ఆహ్వానిస్తారు.
పారాసైట్‌ చాలా నైపుణ్యంతో కూడిన చిత్రనిర్మాణంలో చెప్పుకోదగ్గ భాగం,ఇది తప్పక చూడవలసిన చిత్రం, కాబట్టి నేను UK సాధారణ విడుదల తేదీలో చిత్రాన్ని మళ్లీ చూడాలని ఎదురు చూస్తున్నాను.
Entry #37145 — Discuss 0 — Variant: Not specified
Voting points1st2nd3rd
41 x400
పారాసైట్ సినిమా ప్రారంభం నుండి చివరి వరకు నన్ను కట్టిపడేసిందని చెప్పడం చాలా చిన్నమాట; ట్రాకింగ్ షాట్‌లతో ఆ సినిమా చిత్రీకరణ శైలి అద్భుతంగా ఉంది. లండన్ కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా అనేక కొరియన్ సినిమాలు వీక్షించిన నాకు, ఆ తరహా చిత్రాల్లో ఉపయోగించే సాధారణ జానర్లు గురించి బాగా తెలిసినప్పటికీ, పారాసైట్ సినిమా వాటన్నింటినీ ఉల్లంఘించినట్లుగా అనిపించింది! పారాసైట్ కామెడీగా ఉంటుంది, చమత్కారమైన రీతిలో సాగినప్పటికీ, అదొక థ్రిల్లర్ లాగా కూడా ఉంటుంది, అది క్లాస్ విభజనలకు లొంగలేదు. అలాగే, ఇతర జానర్లను స్పృశిస్తూనే ఒక కుటుంబ కథా చిత్రంగా సాగిపోతుంది. అందుకే, అది అన్ని వయసుల వారిని ఆకట్టుకోగలదు.
పారాసైట్‌లో కనిపించే సూక్ష్మ నైపుణ్యాలు మరియు దాని స్టైలిష్ సినిమాటోగ్రఫీ లాంటివి ఒక సినిమాగా దానిని వీక్షించడానికి అర్హతలు లాంటివి. సంగ్రహంగా చెప్పాలంటే, దుర్మార్గులను అడ్డుకోవడం కోసం పార్క్ కుటుంబం మరియు కిమ్స్ అనే నిరుద్యోగ కుటుంబం మధ్య సాగే పరస్పర చర్య మరియు ఆ కుటుంబాల విభిన్న ప్రపంచాలు ఎదుర్కొనే సుదీర్ఘ పరిణామాల నేపథ్యంలో పారాసైట్ కథ సాగుతుంది.

[...]ప్రకాశవంతంగా కనిపించే షాట్లతో పాటు ఇండోర్ స్పేస్‌ని సమర్థంగా ఉపయోగించడం ద్వారా, బాంగ్ జూన్-హో ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించగలిగాడు 2 గంటల 12 నిమిషాల నిడివితో సాగే ఈ సినిమాలోని చాలా సన్నివేశాలు పార్క్ కుటుంబం ఇంట్లోనే సాగుతాయనే విషయం గ్రహించినప్పుడు మనకి ఆశ్చర్యం తప్పదు. బాంగ్ జూన్-హో తన నైపుణ్య ప్రదర్శనతో పాటు చమత్కార దృక్పథంతో ముడిపడిన దేశీయతా ప్రాపంచిక అంశాలను కళ్లకుకట్టాడు. పారాసైట్ సినిమా ఒక స్లో బర్నర్ లాంటిదైనప్పటికీ, దాని అందం మరియు చాతుర్యం మీకు ఆనందం కలిగిస్తుంది. ఎందుకంటే, ఇదంతా ఒక స్థాయిలో మాత్రమే పనిచేస్తుందని పరాన్నజీవి ఒప్పించినప్పటికీ, నిజానికి అది బహుళ-పొరలతో, సానుభూతి మరియు విషాదం కలగలసిన సామాజిక వాస్తవికతను వర్ణిస్తుంది.

సినిమాలోని నటీనటుల నటన కట్టిపడేస్తుంది, వారిలోని ప్రతి ముఖ కదలిక మరియు చేష్టలు గొప్పగా ఉంటాయి, కెమెరా అద్భుతంతో మెట్లు ఎక్కడం లేదా దిగడం లాంటి దృశ్యాలు సైతం ఏదో దాగిన అర్థాన్ని స్ఫురిస్తాయి. అసాధారణ కెమెరా యాంగిల్స్‌తో, నాటకీయ వాతావరణ పరిస్థితుల మధ్య అలాంటి అనుభూతి పెంచగల ప్రదేశాన్ని సమర్థవంతంగా సృష్టించడం వల్ల కూడా ఆ తరహా అసౌకర్య స్థాయిలు గొప్పగా సృష్టించబడ్డాయి. పారాసైట్‌లో మనకి అధివాస్తవిక స్వభావం కనిపిస్తుంది, దాని స్కోర్ ఈ విషయాన్ని నొక్కి చెప్పింది. అలాగే, అసంబద్ధ అంశాలను సైతం ఈ సినిమా తెలివైన మార్గంలో చూపెడుతుంది. నిజంగానే ఇదొక సినిమాటిక్ మ్యాజిక్. పారాసైట్‌లోని స్పష్టమైన వింతత్వం మిమ్మల్ని నిస్సందేహంగా చేస్తుంది. ట్విలైట్ జోన్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్‌ మీకు ఏమాత్రం వింతగా అనిపించదు.

ఈ సినిమాలోని నటీనటులు గొప్పగా ఆకట్టుకుంటారు. ఎలాంటి ప్రయత్నం లేకుండానే కూల్‌గా కనిపించే సాపేక్షతను సృష్టించే పాత్రలకు వాళ్లు మరింత విస్తృతతను జోడించారు. పార్క్ ఫ్యామిలీ హోమ్‌లో కి-వూ మరియు కి-జియాంగ్ కిమ్ ప్రైవేట్ ట్యూటర్లుగా పనిచేసే సమయంలో, వాళ్లు నిర్మొహమాటంగా గొప్ప నటన ప్రదర్శించారు. మాటలు లేకుండానే, దాదాపుగా కల్పితమైన తీరుతో, బోధనా పద్ధతులతో ఒక నిగూఢమైన ఛాయను వాళ్లు గొప్పగా ప్రదర్శించారు. పార్క్ సో-డామ్ మరియు చోయ్ వూ-సిక్, కి-వూ మరియు కి-జియాంగ్‌ లాంటి నటీనటలు విభిన్న కోణాల నటనతో పారాసైట్ సినిమాని తప్పక చూడాలనే కోరిక కలిగిస్తారు. తమ పాత్రోచిత ప్రదర్శనతో నిస్సందేహంగా ప్రేక్షకులను తమ వైపు తిప్పేసుకుంటారు.

[...]పారాసైట్ సినిమాని అత్యంత నైపుణ్యంతో పూర్తిచేసిన చిత్రనిర్మాణంగా చెప్పవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే, ఇదొక తప్పక చూడాల్సిన సినిమా. అందుకే, UKలో విడుదలైనప్పుడు మరోసారి ఈ సినిమా చూడడం కోసం నేను నిరీక్షిస్తున్నాను.
Entry #37531 — Discuss 0 — Variant: Literary Telugu
Voting points1st2nd3rd
41 x400
ప్రారంభం నుండి చివరి వరకూ పారాసైట్ వల్ల నేను ప్రేరేపించబడ్డానని చెప్తే అది అతిశయోక్తి కాదు; ట్రాకింగ్ షాట్ ‌లతో దాని చిత్రీకరణ శైలి ముగ్ధమనోహరంగా ఉంది. లండన్ కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో అనేక కొరియన్ చిత్రాలను చూసిన తరువాత, అటువంటి చిత్రాలలో ఉపయోగించే సాధారణ శైలులకు నేను సుపరిచితుడునైనప్పటికీ పారాసైట్ వాటన్నీటినీ సవాలు చేసినట్లు అనిపించింది! పారాసైట్ చమత్కారమైన రీతిలో హాస్యభరితమైనది, ఇది థ్రిల్లర్, అన్ని వర్గాల వారిని కలుపుతూ ఇతర జోనర్లతో పాటు మధ్య తరగతి కుటుంబ కథను కూడా వర్ణిస్తుంది కాబట్టి అన్ని వయసుల వారికి ఆకట్టుకునే అవకాశం ఉంది.

పారాసైట్ సినిమా దాని సూక్ష్మ నైపుణ్యాలను మరియు స్టైలిష్ సినిమాటోగ్రఫీని అభినందించడానికి అన్ని విధాలా చూడతగినది. చిత్రం పట్ల ఆసక్తిని తగ్గించకుండా సంగ్రహంగా చెప్పాలంటే, సుదీర్ఘ పరిణామాలతో ఢీకొనే పూర్తి భిన్న ప్రపంచాలు గల పార్క్ కుటుంబం మరియు నిరుద్యోగులైన కిమ్ కుటుంబాల మధ్య జరిగే పరస్పర సంబాషణల యొక్క కథను పారాసైట్ చెబుతుంది.

[...]ప్రేక్షకుల ఆసక్తిని ప్రకాశవంతమైన వెలుతురులో తీసిన షాట్ ‌లతో పాటు ఇంట్లో లోపలి ప్రదేశాన్ని బాంగ్ జూన్-హో ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకున్నాడంటే సినిమాలోని 2 గంటల 12 నిమిషాల నిడివి తర్వాత, చాలా మటుకు సన్నివేశాలు పార్క్ కుటుంబం ఇంటిలోనే జరిగాయని మనకి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సగటు ఇంటికి సంబందించిన లౌకిక అంశాలు బోంగ్ జూన్-హో యొక్క నైపుణ్యం వల్ల ఆసక్తికరమైన దృక్కోణంలో చిత్రీకరించబడ్డాయి. కధ నెమ్మదిగా కొనసాగదం వలన పారాసైట్ కేవలం ఒక కోణంలో మాత్రమే కనిపిస్తుందని అనిపించవచ్చు కానీ వాస్తవానికి ముందుకు సాగే కొద్దీ అందులోని జాలి మరియు కరుణతో సామాజిక వాస్తవికతను వర్ణిస్తూ బహుళ-కోణాలను అందంగా మరియు తెలివిగా తెరకెక్కించడం చూసి మీరు ఆనందిస్తారు. అయితే ఈ చిత్రంలో పాత్రలు ఏ విధంగా చిత్రీకరించబడ్డాయంటే ముందుకు సాగే కొద్దీ పాత్రల యొక్క నైజం బయటపడుతుంది

. మెట్లు పైకి ఎక్కడం లేదా క్రిందికి దిగడం వంటి పనులు కూడా గూడార్ధాన్ని తెలియజేసే విధంగా ప్రతీ ముఖకవళికను ప్రస్ఫుటంగా కెమెరా బంధిస్తుంది. ఇబ్బందికరమైన కోణాలను కూడా అసామాన్యమైన కెమెరా కోణాలతో సమర్థవంతంగా చిత్రీకరించడం ద్వారా నాటకీయ సన్నివేశం వాతావరణంలో సదరు అనుభూతిని ప్రేరేపిస్తాయి. పారాసైట్ ఒక కాల్పనిక స్వభావం కలిగి ఉందని, చిత్రం యొక్క నేపధ్య సంగీతం స్కోరు నొక్కి చెబుతుంది, ఇంకా అసంబద్ధమైన అంశాలను తెలివైన పద్ధతిలో అవలంబించి రూపొందించిన ఈ చిత్రం నిజంగా ఒక అద్భుత కళాఖండం అని చెప్పవచ్చు. పారాసైట్ లో స్పష్టంగా నడిచే అసాధారణమైన రహస్యం ఖచ్చితంగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది మరియు ట్విలైట్ జోన్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ‌యొక్క శైలికు దగ్గరగా అనిపిస్తుంది.

నటులందరు బాగా ఆకట్టుకుంటారు మరియు సాపేక్షతను సృష్టించే వారి పాత్రలకు వైవిధ్యాన్ని జోడిస్తూ సునాయాసంగా అభినయిస్తారు. కి-వూ మరియు కి-జియోంగ్ కిమ్ పార్క్ ఫ్యామిలీ హోమ్ ‌ లో ప్రైవేట్ ట్యూటర్ ‌లుగా పనిచేస్తున్నప్పుడు, వారు ఖచ్చితమైన ఈ ఉదాసీన వైఖరి, అధికారాన్ని తక్కువగా చూపించి అస్పష్టమైన, దాదాపు పౌరాణిక బోధనా పద్ధతులను ఉపయోగించడం ద్వారా ఆధ్యాత్మిక శోభను సృష్టిస్తారు. సరళంగా చెప్పాలంటే, నటులు పార్క్ సో-డామ్ మరియు చోయ్ వు-సిక్, కి-వు మరియు కి-జియోంగ్ లాగ వారి ఆసక్తికరమైన నటనతో పారాసైట్ అనుసరించే వివిధ దిశలలో తమ ప్రదర్శనలను సజావుగా నిర్వహించి, ప్రేక్షకులను తమ వైపు మళ్లించుకుంటారు.

[...]పారాసైట్ ఎంతో నైపుణ్యం కలిగిన ఒక అద్భుత కళాఖండం, ఇది తప్పక చూడవలసిన చిత్రం, అందుకే ఈ చిత్రాన్ని దాని UK సాధారణ విడుదల తేదీన తిరిగి చూడటానికి నేను ఆసక్తితో ఉన్నాను.
Entry #37534 — Discuss 0 — Variant: Not specified
Voting points1st2nd3rd
0000